Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలి
- పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
- రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పదవ తరగతి ఫైనల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారం భమయ్యే పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో గురువారం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీ క్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు చేపట్టాల్సిన ఏర్పాట్లకు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా లో 226 పరీక్షా కేంద్రాల ద్వారా 49,574 మంది విద్యార్థు లు, రెగ్యులర్ 729 మంది విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. 34 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయన్నారు. పోలీస్ శాఖ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో విద్యార్థులు పరీక్షా కేం ద్రాలకు చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడి కల్ పాయింట్ ఏర్పాటు చేసి ఏఎన్ఎమ్ను కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టా లని అన్నారు. పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోస్టల్ శాఖ జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవా లని సూచించారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవె న్యూ అధికారి హరిప్రియ, జిల్లా విద్యశాఖ అధికారి, పోలీస్ అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.