Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు
- నిరసన దీక్షలో పాల్గొన్న నాయకులు
నవతెలంగాణ-మియాపూర్
ఇజ్జత్‌నగర్ శ్మాశాన వాటికను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని కుట్ర చేస్తున్నదని, దీనిని కాపాడుకోవడానికి సీపీఐ నిరాహార దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు అన్నారు. నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు కే.చందుయాదవ్, వెంకటస్వామి, కానమెట్ శాఖ కార్యదర్శి కాసిం నరసమ్మ, జట్టి శ్రీనివాస్‌తో పాటు పార్టీ కార్యకర్తలు 20 మంది కానామెట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక్కరోజు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానా మేట్ సర్వేనెం బర్ 41/14లో ఐదు ఎకరాల స్థలంలో శ్మశాన వాటిక ఉందన్నారు. ఆ శ్మశాన వాటికకు హద్దులు కేటాయించి, పట్టా పాసు బుక్కు ఇవ్వాలని గతం నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసినట్టు తెలిపారు. అధికారులు సర్వే చేసి శ్మశాన వాటిక ఉందని తేల్చినట్టు తెలిపారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో గవర్నమెంట్ భూము లు, అన్యాక్రాంతం, కబ్జాకు గురవుతుంటే అధికారులు పట్టించుకో వడం లేదన్నారు. పేదల శ్మశాన వాటికను మాత్రం ఫ్లాట్‌గా నిర్ణయిం చి వేలం వేశారని అన్నారు. తాము హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు కళ్ళు తెరిచి, శ్మశాన వాటిక స్థలాన్ని వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.