Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఆదిభట్ల ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు పద్మావతికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో పాధ్యాయులు వరకాల పరమేష్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సర్వీసులో బది లీలు సర్వసాధారణమన్నారు. కానీ ఉపాధ్యాయులకు బదిలీలు జరిగినప్పుడు పాఠశాలలో పనిచేసిన రోజులు విద్యార్థులతో మమేకమై విడదీయరాని బం ధాలు ఏర్పడతాయన్నారు. బదిలీపై వెళ్లేటప్పుడు బరువెక్కిన హృదయంతో వెళతారన్నారు. బదిలీపై ఎక్కడికి వెళ్ళినా అక్కడి విద్యార్థుల ప్రేమాభిమా నాలు పొందాలని వక్తలు తెలిపారు. మండల ఏవీ ఇంద్రసేనారెడ్డి, గోవర్ధన్, భారతి, రాములు ఉపాధ్యాయులు బబ్లీ, సన్మాన గ్రహీత పద్మావతి, బుచ్చ య్య, రామ్మోహన్, అశోక్, జంగయ్య, విజయ లక్ష్మి, ఇందిర పాల్గొన్నారు.