Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ తెలంగాణ
- ఉపాధ్యాయ పత్రికా సంపాదకులు పున్రెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి కటేపల్లి జనార్థన్‌రెడ్డిని గెలిపించాలని తెలంగాణ ఉపాధ్యా య పత్రికా సంపాదకులు పున్రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో గురువారం పర్యటించి, ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్య ర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా సా ధారణ ఉపాధ్యాయుని స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసున్న ఎమ్మెల్సీ, పీఆర్టీయూ తెలం గాణ ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తు న్నామన్నారు. ఉపాధ్యాయులకు పిల్లల సంరక్షణ సెలవులు, ప్రభుత్వాన్ని ఒప్పించి, 30శాతం ఫిట్మెంట్ ఇప్పించడంలో కాటేపల్లి జనార్దన్ రెడ్డి పాత్ర కీలకమన్నారు. ఏప్రిల్ ఒకటి నుండి ఉపాధ్యాయులందరికీ ఈ హెచ్ఎస్ అమలు జరిగేలా ప్రభుత్వంతో చర్చించాలన్నారు. రానున్న రోజుల్లో పండిత్‌ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 317 జీవోతో వేరే జిల్లా లకు వెళ్లిన ప్రతి ఉపాధ్యాయున్ని స్థానిక జిల్లాకు తీసుకువస్తానని హామీ ఇచ్చా రు. ఉపాధ్యాయులు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని చె ప్పారు. ఈ సమావేశంలో సత్తిరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి సత్తారి రాజిరెడ్డి, జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.