Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్
- టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పీఆర్సీపై ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పనుందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ తెలిపారు. గురువారం టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వరంలో నిర్వ హించిన 2023 ఇయర్ డైరీ, క్యాలెండర్ అవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ పాల్గొని డైరీ, క్యాలెం డర్ అవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 24 హెచ్ఆర్ఏ, హెల్త్‌కార్డుల సమస్యలను ప్రభుత్వం తీర్చుతునుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్, విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.