Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి
- సిలిండర్ల ధర పెంపునకు నిరసనగా కడ్తాల్ లో నరేంద్రమోడీ దిష్టి దహనం
నవతెలంగాణ-ఆమనగల్
నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి తదితరులు హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పాలసీలతో ధనవంతులే మరింత ధనవంతులుగా మారుతున్నారని, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెబుతూనే ప్రజలపై మోయలేని భారం వేయడం అన్యా యమన్నారు. ప్రస్తుతం నింగిని తాకుతున్న చమరు మంటల్లో చివరికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలి బూడిదవుతుందని వారు హెచ్చరించారు. పేంచిన సిలిం డర్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకు అందించడంతో పాటు, ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీక్యా నాయక్, మండల అధ్యక్షుడు యాట నర్సింహ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేతావత్ హీరాసింగ్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, నాయకులు గురిగల్ల లక్ష్మయ్య, బిచ్చ నాయక్, మల్లేష్ గౌడ్, యాదయ్య గౌడ్, మల్లయ్య, శ్రీను, రాజేష్, తులసిరామ్, రవి, రాజేందర్ గౌడ్, రంగా, శ్రీశైలం, మహేష్, శ్రీకాంత్, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు.