Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు అరుణ్ కుమార్, శ్రీనివాస్
నవతెలంగాణ-చేవెళ్ల
కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్లలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలం గాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న ఆంధ్ర పాలకుల చైతన్య, నారాయణ విద్యాసంస్థలను మూస ివేస్తామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక బ్రాంచ్లుగా నారాయణ, శ్రీ చైతన్య విస్తరిస్తూ, ఫీజుల దోపిడీ అధికమవుతోందన్నారు. చదువు పేరుతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఆ కళాశాలలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఆ కార్పొరేట్ విద్యా సంస్థలను వెంటనే బంద్ చేసి, గుర్తింపు రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు ఏసు, విగేష్, సోను, కవిత, రమ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.