Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాడుతామని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్‌కు సంబం ధించిన ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర గురు వారం 23వ రోజుకు చేరింది. హైదర్‌నగర్ డివిజన్లో రామ్ నరేష్ నగర్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అలితలాబ్ చెరువు కబ్జా, వద్ధులకు పింఛన్, రేషన్ కార్డులు, డ్రయినేజీ, తాగునీటి సమస్య ప్రధానమైన సమస్యలు అని తెలిపారు.బీఆర్ఎస్ నాయకులు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్పొరేటర్ విచ్ఛల విడిగా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు, అలితలాబ్ చెరువు కబ్జాలు చేస్తూ ప్రజా సొమ్ము దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలు నడవడానికి వాకింగ్ ట్రాక్ వేస్తామని నమ్మిస్త్తూ కబ్జాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రజలను మోసం చేసి కల్వకుంట్ల కుటుంబం మాత్రం ఫామ్ హౌస్‌లో ప్రగతి భవన్లో ప్రజాధనాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. అంతేకాకుండా డ్రయినేజీ వ్యవస్థ సారిగా లేకపోవటం వల్ల వర్షపు నీరు,మురుగునీరు రోడ్లపై పారుతూ లోతట్టు ప్రాంత గృహాల్లోకి ప్రవహిస్తుందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు రావడం లేదని, విధుల్లోకి రాకపోవడంతో రోడ్లు, పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పై సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. లేనియేడల స్థాని కులతో ధర్నా చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో నవీన్‌గౌడ్, శ్రీనివాస్, కృష్ణంరాజు, బద్రి, అంబ దాస్, వీర్రయ్యచారి, శ్రీహరి, కోటేశ్వరరావు, లక్ష్మీ నారాయణ, రాజారెడ్డి నారాయణరెడ్డి, భ్రమ్మయ్య, బాలరాజ్, రాజు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.