Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జంగారెడ్డి
నవతెలంగాణ-షాబాద్
సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జంగారెడ్డి అన్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని మన మర్రి గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లా డుతూ సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దళితు లకు మూడెకరాలు, 100 పడకల ఆస్పత్రి, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, మండల అధ్యక్షులు కిరణ్, సర్పంచ్ సుహాసినిసత్యనారాయణ, ఉపసర్పంచ్ గోపాల్, నాయకులు వెంకటేష్, చంద్రశేఖర్, శంకరయ్య, ముస్లియ్య, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.