Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బందితో ఎంపీడీవో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-యాచారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు.శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివద్ధి పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యం, హరితహారం, క్రీడా ప్రాంగణాలు, టాక్స్ కలెక్షన్, నర్సరీలు, ఇతర అంశాలపై సమీక్ష చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు అంతా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఉమారాణి, ఈసీ, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.