Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
గ్రామాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారుడు, పెదవేడు గ్రామ సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెదవేడు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి టీపీసీసీ మాజీ కార్యదర్శి పీసరి సురేందర్‌రెడ్డి తన పట్ట భూమిలో నుంచి 400 గజాలు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అందజేశారు. ఈ నేపథ్యంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లా డుతూ గ్రామంలో నూతన పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలం లేనందున, అడిగిన వెంటనే స్పందించి 400 గజాల స్థలం అందించిన పీసరి సురేందర్‌రెడ్డికి ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుదర్శర్‌రెడ్డి, గ్రామస్తులు నర్సిం హులుగౌడ్, రాజేశ్వర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, మహేందర్, అనంత్, నర్సయ్య, గోవర్ధన్‌గౌడ్, సూర్యకాంత్‌రెడ్డి, తదితరులున్నారు.