Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి
నవతెలంగాణ-ఆమనగల్
ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడుల ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి అన్నారు. శుక్రవారం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ముర్తూజ పల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులు సాగుచేస్తున్న వేరుశనగ, మైసూర్ మల్లిక అనే వరి రకం, జొన్న, సజ్జ తదితర పంటలను పరిశీలించారు. అదేవిధంగా రైతులు సొంతంగా తయారు చేస్తున్న జీవామృతం, ఆగేయాస్త్రం తదితర ప్రకృతి సిద్ధమైన కషాయాలను పరిశీలించి వారికి కావాల్సిన సలహాలు సూచనలు తెలిపారు. పంటల సాగుకు కావాల్సిన పెట్టుబడులను తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు పొందడానికి రైతులు అందరూ ప్రకృతి ఆధారిత పంటలను సాగుచేసి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కర్నాటి సాయిరెడ్డి, కర్నాటి వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.