Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
నవతెలంగాణ-షాబాద్
ప్రతి ఒక్కరూ సేవా దక్పథాన్ని అలవర్చుకోవాలని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితరెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో గిఫ్ట్ ఏ స్మైల్ కింద తన సొంత డబ్బులతో, జిల్లా పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు (ట్రై సైకిళ్ల) ,స్కూటీ షాబాద్‌కు చెందిన వాజిద్‌కు స్కూటీని పంపిణీ చేశారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు, వికలాంగులు సహాయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సహాయం చేస్తే, జీవితంలో మరపురాని ఆనందం పొందవచ్చన్నారు. ఎంత డబ్బులు సంపాదించడం అనేది గొప్ప కాదనీ, ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటేనే ఆనందం ఉటుందని తెలిపారు.వికలాంగుల కోసం ఇప్పటికే సుమారు రూ.30 లక్షలతో సొంత ఖర్చులతో షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి స్కూటీలను పంపిణీ చేయడంపై ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు జడల రాజేందర్ గౌడ్, మైనార్టీసెల్ అధ్యక్షులు ముకురఖాన్, సర్పంచులు శ్రీధర్ రెడ్డి, నాయకులు రమేష్ యాదవ్, మునీర్, సుధాకర్ గౌడ్, ఇమ్రాన్, నరసింహారెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, సహకార సంఘాల డైరెక్టర్ నర్సింలు, అవినాష్ రెడ్డి యువసేన నాయకులు అజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.