Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ధరలు పెంచి నిరుపేదలపై భారాలు..
- రూ.400 నుంచి రూ1200లు పెంచిన ఘనత బీజేపీదే
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-తలకొండపల్లి
దేశాన్ని లూఠీ చేసి విదేశాలకు పారిపోతున్న కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రాయితీలు కల్పిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సామాన్యులపై నిత్యవసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు అధిక భారం వేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి శంకర్ అన్నారు. శుక్రవారం తలకొండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తలకొండపల్లి బస్టాండ్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన , మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ ధర్నాలో ఆమనగల్ మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ముజీబుర్ రెహమాన్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నర్సింహా పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సిలిండర్ ధర పెంచితే ప్రధానికి గాజులు పంపిన కేంద్ర మంత్రి స్మతి ఇరానీ ప్రస్తుతం ప్రధాని మోడీకి గాజులు ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ప్రగల్పాలు పలికిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పెంచిన ధరలకు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు హైమావతి రమేష్, చంద్రయ్య, పార్టీ గ్రామాధ్యక్షులు అంజయ్య, నాయకులు సజ్జు పాషా, యద య్య, శంకర్ నాయక్, శ్రీశైలం యాదవ్, రాములు, కృష్ణయ్య, హరిమోహన్ రెడ్డి, విజరు యాదవ్, ఆనంద్, మల్లేష్, రమేష్, వెంకటేష్, మల్లారెడ్డి, దస్తగిరి, మధు, స్వామి గౌడ్, రమేష్, నర్సింహ, శ్రీను, చెన్నకేశవులు, సుల్తాన్, గణేష్ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.