Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్సవాలు
- పాల్గొన్న షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
మండలంలోని గూడూరులో జరుగుతున్న శ్రీ విశాలాక్ష్మి అమ్మవారి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని వసతులు కల్పిం చారు. చివరి రోజు శుక్రవారం శివపార్వతుల కల్యాణోత్సవం వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఆ కల్యాణో త్సవానికి ముందు మూల విగ్రహాలు శ్రీ గణపతి, శ్రీ సుబ్ర హ్మణ్య, శ్రీ విశాలాక్ష్మి అమ్మవారి సమేత, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, నవగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట మహాకుభాభిషేకం నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం అనంతరం శోపా ర్వతుల పల్లకి సేనా ఊరేగింపు హారతి తీర్థ ప్రసాద వితరణ లో నిర్వహించారు.
ఉత్సవాల్లో పాల్గొన్న షాద్‌నగర్ ఎమ్మెల్యే
శివపార్వతుల కల్యాణోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు వేద పండితులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన భజన గీతాలు పాడారు. ఉత్సవాలకు జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ఈటా గణేష్, కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్య నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తయ్య, ఉపసర్పంచ్ దయానంద్ గుప్తా, ఎమ్మే సత్యనారాయణ, బాతుక దేవేందర్ యాదవ్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, పెంటనోళ్ల యాదగిరి, శివ శంకర్ గౌడ్, చేగుర్ పీఎసీఎస్ చైర్మెన్ అశోక్, వైస్ చైర్మెన్ మున్నూరు పద్మారావు, వంకాయల నారాయణరెడ్డి, కడల శ్రీశైలం, మామిళ్ల విఠల్, చిర్ర మధుసూదన్‌రావు, మోడీ దర్శన్, గుండు సురేష్, వెంకటేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.