Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
సీఎం సహాయనిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగిం చుకోవాలని కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయ కులు మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లోయపల్లి గ్రామానికి చెందిన దోసపాటి బాలమణి, కె.కరాజేశ్లకు సీఎం సహాయనిధి చెక్కులు అంద జేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హైదరా బాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా, ఆ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో డి.బాలమ్మకు రూ.36000 వేలు, కె. రాజేష్‌కు రూ.60 వేలు మంజూరు చేసినట్టు చెప్పారు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధిని సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో నాయకులు మర్రిరాంరెడ్డి, సాంరెడ్డి మహి పాల్‌రెడ్డి, బాబుగౌడ్, మోహన్ నాయక్ ఉన్నారు.