Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య
- ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-యాచారం
కేంద్ర ప్రభుత్వం నిత్యం గ్యాస్ ధరలు పెంచుతూ పేదలపై భారాలు మోపుతుందని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య ఆరోపించారు. శుక్రవారం యాచారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషా ఆధ్వర్యంలో శుక్రవారం గ్యాస్ ధరను పెంచడానికి నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ పేదలు వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50, కమర్షియల్ సిలిండర్ పై రూ.350లు పెంచిందన్నారు. 8 ఏండ్ల బీజేపీ పరిపాలనలో పేదల పైన రూ.7 వందలు అదనంగా భారం మోపిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మెన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి, సర్పంచులు బండిమీది కృష్ణ మాదిగ, ఎండీ హబీబుద్దిన్, చిగురంత శ్రీనివాస్ రెడ్డి, వన్న వాడ అరుణమ్మ, ఎంపీటీసీలు మోరుగు శివలీల, డేరంగుల శారద, కుందారపు సుమతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తలారి మల్లేష్, శంకర్ నాయక్, పీఎసీఎస్ డైరెక్టర్లు మద్దెల శశికళ, మక్కపల్లి స్వరూప, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మండలి గోపాల్, కార్యదర్శి పోలే మహేష్, నాయకులు శ్రీనివాస్ చారి, జానీ, కొల్లం అనంతరెడ్డి పాల్గొన్నారు.