Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్వకుర్తి శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్
- సిలిండర్ ధరల పెంపుపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
నవతెలంగాణ-ఆమనగల్
బీజేపీ ప్రభుత్వానికి మహిళలే సరైన గుణపాఠం నేర్పుతారని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. సిలిండర్ల ధర పెంపునకు నిరసనగా శుక్రవారం జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్యనాయక్ ఆధ్వర్యంలో ఆమనగల్ పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ పాల్గొని, మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలు తగ్గించుకపోతే మహిళలే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ పత్యానాయక్, రైతు సమన్వయ కమిటీ మండలాధ్యక్షులు నిట్ట నారాయణ, ఎంపీటీసీలు దోనాదుల కుమార్, సరిత పంతు నాయక్, సర్పంచ్లు మల్లమ్మ యాదయ్య, సోనా శ్రీను నాయక్, ప్రేమలత నర్సింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్, కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, నాయకులు తల్లోజు రామ కృష్ణ, వస్పుల సాయిలు, రాములు యాదవ్, మల్లేష్ నాయ క్, గుత్తి బాలస్వామి, భీమయ్య, శివలీలా, పరమేష్, జయ మ్మ, నర్సిరెడ్డి, చుక్కమ్మ, లాలయ్య, రమేష్ నాయక్, డేరం గుల వెంకటేష్, పూసల భాస్కర్, శివకుమార్, యాద య్య, అల్లాజీ, రమేష్, సత్యం, రంజిత్, శేఖర్, విక్రమ్ పాల్గొన్నారు.
-కడ్తాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కంబాల పరమేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ జోగు వీరయ్య, సర్పంచ్లు ముద్వెంటి సులోచన సాయిలు, భారతమ్మ నర్సింహ గౌడ్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, ఎల్లాగౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు లాయఖ్ అలి, నర్సింహాగౌడ్, నాయకులు బిక్షపతి, రామచంద్రయ్య, మహేష్, రాజేందర్, ఇర్షాద్, కృష్ణ, జంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.