Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
- కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మే శ్రీలత సత్యనారాయణ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-కొత్తూరు
వంట గ్యాస్ సిలిండర్ పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేనిచో కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మే శ్రీలత సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఎమ్మే శ్రీలత సత్యనారాయణ, కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవులు నిరసనలో పాల్గొన్ని, మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధర 200 నుంచి నేడు రూ.1155 లు చేరుకుందన్నారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వంట గ్యాస్ ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసు కోవాల న్నారు. లేనిచో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనం తరం తహసీల్దార్ రాములకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బాతుక దేవేందర్ యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, ఏనుగు మడుగుతండా సర్పంచ్ అరుణ రమేష్, కోడిచెర్ల ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, లింగం నాయక్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు కడల శ్రీశైలం, చిర్ర మధు సూదన్ రావు, గోపాల్ నాయక్, జోగు బాలరాజ్, కమ్మరి జనార్ధన్‌చారి, రవి నాయక్, ఆంజనేయులు గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.