Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం చెన్నారం, జంగారెడ్డి, ఎడవెల్లి గ్రామాల్లో శుక్రవారం ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణ మాట్లాడుతూ మండలంలో అక్రమంగా ఇసుక ఫిల్టర్లను నిర్వహిస్తున్నారనీ, ఈ ఫిల్టర్లను ధ్వంసం చేసేందుకు మండలంలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే ఆర్ఐ మంజుల తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో కలిసి జంగారెడ్డిపల్లిలో ఒక్కటి, ఎడపల్లిలో మూడు, చెన్నారంలో ఇసుక ఫిల్టర్లను గుర్తించి ధ్వంసం చేయించినట్టు తెలిపారు.ఈ ఐదు ఫిల్టర్లతో ఇసుక తయారీ కోసం ఉప యోగించే మోటార్లను తీసుకు రావడంతోపాటు ఇసుక డంపును సీజ్ చేసినట్టు చెప్పారు. అక్రమంగా ఫిల్టర్లను నిర్వహిస్తున్న వారితోపాటు పొలాల్లో నిల్వ చేసుకున్న వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్టు హెచ్చరించారు. ప్రస్తుతం ఇసుక ఫిల్టర్లను అరికట్టడానికి మండలంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామనీ, ఆ బృందాలు నిత్యం పర్య వేక్షిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ సంతోష్, ఆర్ఐ మంజుల తదితరులు పాల్గొన్నారు.