Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ ఆఫీసర్, డాక్టర్ నెక్టర్
నవతెలంగాణ-శంకర్పల్లి
పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో ముందుంటారని చేవెళ్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెక్టర్, డాక్టర్ గౌతమి పుత్రిక అన్నారు. శంకర్పల్ల్లి మండలంలోని గోపులారం గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని 54 మంది విద్యార్థినీ,విద్యార్థులకు ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాలస్వాస్థన కార్యక్రమం ద్వారా శుక్రవారం పరీక్షలు నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టుకతోనే వచ్చే వ్యాధులను చిన్నప్పుడే గుర్తించి తగిన సమయంలోనే చికిత్సలు అందించాలని సూచించారు. పిల్లలందరూ కాలానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండాకాలం ఎండల్లో ఎక్కువ తిరగకుండా, నీరు బాగా తాగాలన్నారు. తరచుగా ఆకు కూరలు, పప్పు దినుసులు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని విద్యార్థులకు తెలిపారు. జింకు ఫుడ్ లాంటివి తినకూడదని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు పాపగారి ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రతీ ఏడాది తమ పాఠశాలలో విద్యార్థులకు చికిత్సలు చేయడం శుభ పరిణామన్నారు. ఈ కార్య క్రమంలో సిస్టర్ పుష్పలత, ఉపాధ్యాయులు సావిత్రి, లక్ష్మణ శాస్త్రి, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.