Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంపాక్ట్ ఫౌండేషన్ సమస్త వైద్యులు ఆదినారాయణరెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేస్తానని ఇంపాక్ట్ ఫౌండేషన్ సమస్త డాక్టర్ ఆది నారాయణ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణపై శిక్షణా కార్యక్రమంలో ఎర్వాగూడ గ్రామానికి చెందిన గజ్జల సంతోష్ కుమార్ ప్రథమ స్థానం సాధిం చారు. ఈ కార్యక్రమం 37 రోజుల పాటు నిర్వహించినట్టు ఆయన తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని డాక్టర్ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. గజ్జల సంతోష్ కుమార్ మాట్లాడుతూ తాను ఇంటలిజెన్స్ డిపార్టుమెంట్లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిక్షణలో ఎన్నో విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగిందన్నారు. తాను తెలుసుకున్న విషయాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవగాహనా కలిపించి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి, భవిషత్తులో వారి లక్ష్యంపై అవగాహనా కలిపిస్తామని తెలిపారు. అనంతరం డాక్టర్ కళ్యాణ్ (డాక్టర్ లాబ్స్ డైరెక్టర్) ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంప నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రశంసాపత్రం గజ్జల సంతోష్ కుమార్కు అందజేశారు.