Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి అల్లి దేవేందర్
నవతెలంగాణ-చేవెళ్ల
అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. శుక్రవారం అంగన్వాడీ టీచర్ల మూడోవ రోజు సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నాకు చేవెళ్ల నుంచి అంగన్వాడీ టీచర్లు బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంగన్వాడీి టీచర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ పోరాటం విరవించబోమని స్పష్టం చేశారు. వారేమీ గొంతుమ్మ కోరికలు కోరడం లేదని కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి లక్ష్మి, స్వప్న, అనిత, చేవెళ్ల మండల అంగన్వాడీ, టీచర్లు పాల్గొన్నారు.