Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు పంచి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం మతపిచ్చి రాజకీయాలు మానుకోవాలి
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-షాద్నగర్
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొ రట్లకు ధారాదత్తం చేస్తూ, అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడు తున్న కేంద్ర ప్రభుత్వ తీరు మారాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఫరూఖ్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బం దులకు గురి చేస్తుందన్నారు. ధరలను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని మోదీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మరోవైపు కులమత బేధాలను సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపు కుంటు న్నారని దుయ్య బట్టారు. గతంలో రూ. 400 ఉన్న సిలిండర్ ధర మోడీ ప్రభుత్వం వచ్చాక రూ. 1200లకు చేరుకుందన్నారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్, నిత్యావసర ధలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ ఇద్రీస్, మున్సిపల్ చైర్మెన్ నరేందర్, వైస్ చైర్మెన్ నటరాజన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయ ణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, రాజ్యలక్ష్మి, కౌన్సి లర్లు మాధురి నందకిషోర్, జూపల్లి కౌసల్య, పిల్లి శారద శేఖర్, జిటి శ్రీనివాస్ సర్వర్ పాషా, ప్రతాప్ రెడ్డి, మహమ్మద్ ఏజాజ్ అడ్డు, యుగంధర్, సర్పంచ్ ముబీన్ గోరి, ఎంపీటీసీ భీష్మ రామకృష్ణ, శరత్ దామోదర్ యాదవ్ జూపల్లి శంకర్, నడి కూడా యాదగిరి యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ శివ జ్యోతి, అందె మహేష్, గోటిక వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.