Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైరపర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-శంకర్పల్లి
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైరపర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. గ్యాస్ ధర పెంపుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో నియోజకవర్గంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్‌పై 50 రూపాయలు వాణిజ్య అవసరాల గ్యాస్‌పై ఏకంగా 350 రూపాయలు పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మండలం నుంచి బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కావలి గోపాల్, మున్సిపల్ అధ్యక్షులు వాసుదేవ్, శంకర్పల్లి సొసైటీ చైర్మెన్ బద్దం శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, వై చైర్మన్ కురుమ వెంకటేష్, మిర్జాగూడ గ్రామ సర్పంచ్, సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్, గోపులారం గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, పొద్దుటూరు మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి, గాజుల గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్యనారాయణ, యాదగిరి ,మాణిక్యం, వెంకటయ్య ,ప్రశాంత్ రెడ్డి,షాహిద్ ఫరీద్, మిర్జాగూడ వార్డు సభ్యురాలు శారద, గ్రామ ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్, రామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.