Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీలలో సోమవారం ప్రజావాణి అటెండెన్స్ యాప్ తప్పనిసరి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ వికారాబాద్ కలెక్టరేట్
తప్పులు చేసే ఆస్కారం రావొద్దని, తల దించుకు నేలా ఉండకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రగతి, పారిశుధ్యం, విద్యుత్తు, తాగునీరు, అటెండెన్స్ యాప్‌లపై అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టాలని అన్నారు. సిబ్బందిలో స్పష్టమైన మార్పు రావాలని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. శానిటేషన్ ఇన్స్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా మున్సిపల్ సిబ్బందితో పనులు చేయించాలని, పనిచేయని వారిని తొలగిస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో చేపట్టి న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల న్నారు. హరితహారంలో పెట్టిన మొక్కలకు పాదులు తీసి ఎప్పటికప్పుడు నీరు పోయాలని తెలిపారు. మున్సిపాలిటీలో తాగునీరు, విద్యుత్తు, పారిశుధ్యం పనులను మార్చి 20లోపు పక్కగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రతీ సోమవారం
మున్సిపాలిటీలలో ప్రజావాణి
మున్సిపాలిటీలలో సోమవారం ప్రజావాణిని నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పని చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా వినాలని, తమ పరిధిలో పని జరగకుంటే ఎక్కడ జరుగుతుందో సూచించాలని కలెక్టర్ తెలిపారు. సమస్య తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని సూచించారు. ప్రజావాణిలో తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్లు ఉదయం 10:30 నుండి 2 గంటల వరకు ఉండి ఫిర్యాదులను స్వీకరించాలని, వాస్తవికంగా ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. మే 31 లోపు సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డుల పనులను పూర్తి చేయా లని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. అటెండెన్స్ యాప్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కార్యాలయ సిబ్బందిలో స్పష్టమైన మార్పు రావాలనే ఉద్దేశంతో యాప్‌ను తీసుకొచ్చామ న్నారు. కార్యాలయ సమయాల్లో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో నమ్మకాన్ని పెంపొం దించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, శానిటేషన్ ఇన్స్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.