Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ క్లస్టర్ కోశాధికారి భాస్కర్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్చి 6న జరిగే లేబర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కాటేదాన్ క్లస్టర్ కోశాధికారి భాస్కర్ అన్నారు. శుక్రవారం కాటేదాన్ చౌరస్తాలో కార్మికులతో కలిసి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయిస్మెంట్ కనీస వేతనాలు వెంటనే సవరించాలి, ఫైనల్ చేసిన నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు రంగాల జీవోలను జీవో నెంబర్ 21 22 23 24 25లను గెజిట్ చేయాలన్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి పిక్స్ చేయాలి, వారానికి ఐదు రోజులు పని దినాలుగా నిర్ణయించాలి, కాంటాక్ట్ కార్మికులకు చట్టబద్ధత సౌకర్యాలు పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, బోనస్ గ్రావిటీ లాంటి వసతులు తదితర డిమాండ్లు పరిష్కరించాలని కమిషన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహిసు ్తన్నామని చెప్పారు. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి కార్మికుడు విధిగా పాల్గొని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచిన్, ప్రవీణ్, దత్తు, రాహుల్, రాజు,టి వెంకటేష్ గౌడ్, రమేష్, ఈశ్వర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.