Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
- నిందితుని నుంచి రూ.80 లక్షలు స్వాధీనం
నవతెలంగాణ - శంషాబాద్
రియల్ ఎస్టేట్ బ్రోకర్ డబ్బుతో ఉడాయించి పట్టుబడిన ఘటన శంషాబాద్ జోన్ డీసీపీ పరిధిలో శుక్రవారం జరిగింది. శంషాబాద్ జోన్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని థానే జిల్లా బీవాండికి చెందిన కొక్కుల రవి గురువారం శంషాబాద్ ఆర్.జి ఎయిర్ పోర్టు నుంచి తనతో పాటు ఉన్న వ్యక్తులను మరిపించి రూ.80 లక్షల నగదుతో పారిపోయాడు. నగదుతో పాటు ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుడు విజరు కుమార్, శ్రీధర్ అనే వ్యక్తి ఒక మధ్యవర్తి సంతోష్ కుమార్ ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసే ఉద్దేశ్యంతో అతనిని సంప్రదించారు. అసలు ఓనర్ నాగ కిషోర్, మరో ఇద్దరు తమ ప్లాట్ల 4 ప్లాట్లు విక్రయించేందు కు సిద్ధంగా ఉన్నారని ఫిర్యాదుదారుని అతను ఒప్పించాడు. అడ్వాన్స్‌గా వారి నుంచి రూ.20 లక్షల చెక్కు తీసుకుని నగదులోకి మార్చుకున్నాడు. తరువాత డబ్బు ఇచ్చిన తర్వాత ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం అడుగుతున్నప్పుడు అతను భూ యజమానులు బిజీగా ఉన్నారని చెప్పేవాడు. ఈ నెల 02న నిందితుడు ప్లాన్ చేసి ఓనర్లు ఫ్లైట్‌లో వస్తున్నారని చెప్పి ఫిర్యాదుదారుని రిజిస్ట్రేషన్ కోసం నగదుతో రమ్మని అడిగాడు. దీని ప్రకారం హైదరాబాద్ లోనీ షేక్‌పేట్ ఓయూ కాలనీలో నుంచి శ్రీధర్, విజరు కుమార్ కలిసి రూ.80 లక్షలు సేకరించి, నిందితుడితో పాటు భూమి యజమానిని స్వీకరించడానికి ఆర్జీఐ విమానాశ్రయానికి వచ్చారు. కొంత సమయం తర్వాత భూమి యజమాని రాక కోసం ఎదురుచూస్తూ టీ, స్నాక్స్ కోసం వారు శంషాబాద్‌కు వచ్చారు. నిందితుడు కారులో డబ్బును పెట్టారు. ఫిర్యాదుదారుతో పాటు ఇతరులు కారు దిగినప్పుడు, కారును పక్కన పెట్టే నెపంతో నిందితుడు హఠాత్తుగా సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందిన బాధితుడు ఆర్జీఐఏ పోలీసు లను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే అన్ని మార్గాలను అప్రమత్తం చేశారు. ఓఆర్ఆర్ టోల్ గేట్ సిబ్బంది, ఎస్ఓటీ రాజేంద్రనగర్, సీసీఎస్ శంషాబాద్, రాచకొండ పోలీసుల సమన్వయంతో ఆర్జిఐఎ పోలీసులు నేరస్థుడిని పట్టుకున్నారు. అతని నుంచి రూ.80 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. కేవలం మూడు గంటల్లో కేసును పోలీసులు చేదించారు. అతి తక్కువ సమయంలో ఆస్థిని, నేరస్తున్ని పట్టుకోవడంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని డీసీపీతోపాటు ఉన్నతాధికారులు అభినందించారు. పోలీసులు నిదితున్ని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.