Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీపీ జగదీశ్వర్ రెడ్డి
- అగ్ని ప్రమాదాలపై అవగాహనా కార్యక్రమం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ప్రతి ఒక్కరూ విధిగా స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా కన్వెన్షన్‌లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.. వేసవి వచ్చిందంటే కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకున్నకుం టున్నాయని తెలిపారు. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో అతి చిన్న కంపెనీల నుంచి భారీ పరిశ్రమల వరకు తమ ఉత్పత్తులను రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తున్నారని అన్నారు. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో ఏ పరిశ్రమ యజమాని ఫైర్ సేఫ్టీ నిబంధ నలను పాటించకపోవడం దారుణమన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచించడం కంటే జరగక ముందే నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవ చ్చని సూచించారు. కచ్ఛితంగా ప్రతి పరిశ్రమలో అందులో తయారయ్యే వస్తువులు ఉపయోగించే పదార్థాల గురించి విషయాలను నోటీస్ బోర్డ్‌లో రాసి ఉంచాలని అన్నారు. అదేవిధంగా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పడానికి ప్రాథమికంగా నీరు ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటు లో ఉంచాలని సూచించారు. కంపెనీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకో వాలని అన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది వచ్చేలోపు మంటలను ఏ విధంగా అదుపులోకి తీసుకొని రావాలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కంపెనీలో పనిచేసే కార్మికులు చిన్న, చిన్న రూముల్లో నివసిస్తున్నారని, ఎట్టి పరిస్థితిలో కంపెనీలో కార్మికులు నివసించొద్దని తెలిపారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి ఎలా తీసుకురావాలో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపిస్తే ఇలా అదుపులోకి తీసుకురావాలో ఫైర్స్ సిబ్బంది చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గంగాధర్, సీఐ మధు, ఫైర్ సేఫ్టీ అధికారులు జగన్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.