Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో హామీ
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
జూనియర్ కళాశాల ఏర్పాటు దిశగా చర్యలు చేపడ తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ధారుర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో మండల బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కుటుబా ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా వి ద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతు కు ఆనంద్ పాల్గొన్నారు. కార్యకర్తలు స్వాగతం పలికి శాలు వాతో వారిని సన్మానించారు. ముందుగా మండలం పరిధిలోని కుక్కింద సర్పంచ్, మండల సర్పంచుల సం ఘం అధ్యక్షులుగా ఉన్న వీరేశం ఇటీవల మృతిచెందడంతో వారికి నివాళులు అర్పించారు. మంత్రి మాట్లాడుతూ. సీ ఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న ఆసత్య వ్యాఖ్యల ప్రచారాలను తిప్పి కొట్టాలని నాయకులకు, కార్య కర్తలకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీ ఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని పార్టీ మండలంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించా మన్నారు. గ్రామస్థాయి వార్డు స్థాయిల్లో బాధ్యతలు తీసు కున్న కార్యకర్తలు బాధ్యతయుతంగా పనిచేడ యాలన్నారు. జడ్పీటీసీ కోస్నం సుజాత వేణుగోపాల్ రెడ్డి, మండల బీఅర్ ఎస్ అధ్యక్షులు రాజు నాయక్, మండల సీని యర్ నాయ కులు, పార్టీ మాజీ అధ్యక్షులు కే. వేణుగోపాల్ రెడ్డి, మార్కె ట్ కమిటీ ఛైర్మన్ సంతోష్ కుమార్, సర్పంచ్ చంద్రమౌళి, వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.