Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ కురువ ఎర్ర బాలప్ప భార్య బాలమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి మృతురాలి ఇంటికెళ్లి బాలప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ఖర్చుల నిమి త్తం రూ.5 వేలు ఆర్థికసాయం అందించి వారి కుటుం బానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమం లో దోమ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలి.విజరు కు మార్ రెడ్డి, గుండాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి, ఆర్.నరసింహ రెడ్డి, మల్ రెడ్డి, కురువ బీరప్ప, వార్డ్మెంబర్ మాలధార శ్రీను, మాదిగ చెన్నయ్య, మాదిగ దస్తయ్య, శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు.