Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌ను కోరిన మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు
- మున్సిపల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వినతి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ప్రతీ నె లా నిర్వహించాలని కోరుతూ శనివారం తాండూరు మున్సి పల్ బీజేపీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. బీజేపీ సీనియర్ నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలితా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు ప్రతీ నెల నిర్వహించాలని తాండూర్ మున్సిపాలిటీలో ప్రజలు పడుతున్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని తాండూరుకు పర్మినెంట్ మున్సిపల్ కమిషనర్ నియమిం చాలని కోరారు. ఏ విధంగా మున్సిపాలిటీ శాఖలో ఖాళీ గా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సాహూ శ్రీలత, బంటారం లావణ్య, బాలప్ప, పూజా, బీజేపీ సీని యర్ నాయకులు జిల్లా సెక్రెటరీ బంటారం భద్రేశ్వర్, యువమోర్చా నాయకులు కిరణ్ పాల్గొన్నారు.