Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పుల రాజు
నవతెలంగాణ-మంచాల
అధిక, ధరలను నియంత్రించడంలో గ్యాస్ ధరలను తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫల మయ్యాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పుల రాజు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆస్మతపూర్ గ్రా మంలో కేంద్ర, ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం రూ.450 మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇచ్చిందని, కానీ ఇప్పుడున్న కేంద్రం ప్రభుత్వం రూ.12 00కు గ్యాస్ ధరలను పెంచి సామాన్య బారం మోపింద న్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు సాగు నీరు, ఇంటికో ఉద్యో గం, ప్రతి ఇంటికీ తాగు నీరు, ఒక లక్ష రూపాయలు ఋణ మాఫీ చేస్తామని హామీ ఇచిన రాష్ట్రప్రభుత్వం గద్దెను ఎక్కి న తర్వాత మాట మార్చి తెలంగాణ ప్రజలను నట్టేట ముం చిందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ ితే రూ.2 లక్షల ఋణమాఫీ చేస్తామని, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల నా యకులు బోళ్ల జగన్, ఓరు గంటి లింగంగౌడ్, థశరత, అ స్మతపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంథని వెంకటేష్, వారు ్డసభ్యులు మంథని పర్వతాలు, మాజీ వార్డు సభ్యులు మా దం సత్తయ్య, మంథని గణేష్, ఉల్లింతల కృష్ణ, బాసయ్య, లింగస్వామి ఉన్నారు.