Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి
నవతెలంగాణ-మీర్పేట్
అంతరాలు లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా యువత పనిచేయా లని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి అన్నారు. బాలా పూర్ మండలం లెనిన్‌నగర్ సీపీఐ కార్యాలయంలో జరిగిన అఖిల భారత యువజన సమైక్య మండల స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు పాలకుల విధానాల వలన ఉద్యోగ, ఉపాధి అవకా శాలు లేక యువత నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు. మో డీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా మని చెప్పి మోసం చేసిందన్నారు. కనీసం ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని, అవినీతి పెరిగిపో యిందని ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చార ని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు సంపూర్ణంగా ప్రజలకు అందించే దాంట్లో యువత ముందు ఉండాలని సూచించారు. రాబోవు రోజుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మజ్లీస్ ఎంఐఎం పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజ్యాం గాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. యువజన సమె ౖక్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పోలోజు లక్ష్మణాచారి మాట్లాడుతూ చెడు వ్యసనాలకు యువత దూ రంగా ఉండాలని కుల, మత రహిత సమాజాన్ని స్థాపిం చాలని, ఉద్యోగాల కోసం పోరాడాలన్నారు. మార్చి 23న దేశం కోసం చిన్న వయసులో ఉరికొయ్యలు ముద్దాడిన భారతమాత ముద్దుబిడ్డ విప్లవ కిశోరం సర్దార్ భగత్‌సింగ్ వర్థంతి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వెంకటరమణరెడ్డి, డి.శేఖర్, నరేందర్, రాజు, రాజేష్, రాజశేఖర్, అఖిల్రామ్, తదితరులు పాల్గొన్నారు.