Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు సుభాష్ యాదవ్
నవతెలంగాణ-బంట్వారం
తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కా సాని జ్ఞానేశ్వర్ పిలుపు మేరకు 'ఇంటింటికి' తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని వికారాబాద్ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చాÛర్జ్ పి.దివాకర్ ఆధ్వర్యంలో మంగళ వారం బంట్వారం మండలం రొంపల్లి గ్రామంలో 'ఇంటిం టికి' తెలుగు దేశం పార్టీ కార్యక్రమం చేపట్టారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు జి.సుభాష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హజరై ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలో టీడీపీని గెలిపించాలని కోరారు. గతంలో టీ డీపీ ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 5 కిలోలు వరకు రూ.2లకే కిలో బియ్యం ఇచ్చిందన్నారు. చంద్రబాబునా యుడు సీఎంగా కొనసాగినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పను లను ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రం పంచుతూ మళ్ళీ టీడీపీని ప్రజలు ఆదరించాలని, ఇంటింటికి వెళ్లి ప్రజలకు కోరారు. కార్యక్రమంలో టీడీపీ వికారాబాద్ నియోజకవర్గం ఇన్ చార్జి దివాకర్, టీడీపీ బంట్వారం మండల అధ్యక్షులు నర్సింలు, గ్రామస్తులు నర్సింహా రెడ్డి, అంజయ్య, జగన్, శేఖర్ యాదవ్, పాండు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.