Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేబి దొడ్డి గ్రామస్తులు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ - శంషాబాద్
వరద కాలువను అక్రమంగా అనుమతులు లేకుండా పూడ్చి వెంచర్ నిర్మాణం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలువ పునరుద్ధరించి వెంచర్ అడ్డుకోవాలని శంషాబాద్ మండల పరిధిలోని కెపి దొడ్డి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలోని మల్కారం రెవెన్యూ పరిధిలోని అంచమడుగును రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున మట్టి పోసి పూడ్చి వెంచర్ చేస్తున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్‌కు ఆయన నివాసంలో వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసీ వాగు నుంచి అంచ మడుగు కాలువ పాయగా చీలి వర్షా కాలంలో జోరుగా ప్రవహించుకుంటూ మళ్లీ ఈసీలో కలుస్తుందని అన్నారు. దీంతో ఈ ప్రాంతమంతా వరద ముం పునకు గురవుతుందని తెలిపారు. ఈ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున మట్టి పోసి అంచమడుగు పూడ్చి రోడ్డుగా మార్చుకు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంచ కాలువ సమీపంలో బఫర్ జోన్ లేదంటూ జిల్లాస్థాయి ఇరిగేషన్ అధికారి ఎన్ఓసి ఇవ్వడం మరింత ఆందోళనకు గురిచేస్తుందన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా 111 జీ ఓ నిబంధనలు తుం గలో తొక్కుతూ ఏకపక్షంగా ఎల్ఓసీ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఏ విధంగా ఆయన ఎల్ఓసీ ఇచ్చారో దానిపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అంచమడుగు వాగులో పోసిన మట్టిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవా లని విజ్ఞప్తి చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్‌పల్లి సర్పంచ్ దండు ఇస్తారి, వార్డు సభ్యులు బి.చందు, గ్రామస్తులు కే. గోపమ్మ, లలిత, మైసమ్మ, పాప మ్మ, అనురాధ, సుగుణమ్మ, నీలమ్మ, నాయకులు జి. మల్లికార్జున్, ఏ.గోపాల్, కె. శ్రీనివాస్, వీరే శం, ప్రభాకర్‌గౌడ్, బల్వంత్‌రెడ్డి, సిద్దిఖ్, శ్రీకాం త్, ఎం.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.