Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డెర వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విగేశ్
నవతెలంగాణ-తుర్కయాంజల్
వడ్డెర వృత్తిదారులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు విగేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ కోహెడలో 774 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో గల నాలుగు ఎకరాల 21 గుంట భూమిలో వడ్డెర వృత్తి చేసుకుంటున్న భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో పోలీస్ పటేల్ దగ్గర నుంచి తీసుకుని వడ్డెర హరిమాల సొసైటీకి రిజిస్ట్రేషన్ నెంబర్ టీబీ 366/88 ఇచ్చిందని తెలిపారు. 50 ఏండ్ల నుంచి ఈ భూమిలో వడ్డెర వృత్తిని చేసుకుంటూ సుమారు 25 కుటుంబాలు ఈ కార్వీలపై పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని,కొంతమంది పెత్తందారు ఈ భూమిపై కన్ను వేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారన్నారన్నారు. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు చోరువతీసుకొని ఈ భూమిని సమగ్రంగా సర్వే చేసి చుట్టూ హద్దురాలు నాటి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వడ్డెర వృత్తిదారులకు రక్షణ కల్పించాలని కోరారు. కుర్మ సంఘం నాయకులు, కుర్మ యువకులు దౌర్జన్యంగా భౌతిక దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖడించారు. ఈ కార్యక్రమం లో వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు పల్లపు శివకుమార్, పల్లపు ఆంజనేయులు, పల్లపు రంగయ్య, పల్లపు యాదయ్య, బాల్రాజ్, ముత్తయ్య పాల్గొన్నారు.