Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జీ రమేష్ కుమార్
నవతెలంగాణ-పరిగి
స్త్రీ లేనిదే సమాజం లేదని ఎమ్మార్పీఎస్ పరిగి నియో జకవర్గ ఇన్చార్జీ రమేష్‌కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర కళాశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఏ సమస్య వచ్చినా మహిళల తరఫున పోరాడుతున్న ఏకైక నాయకు డు మందకృష్ణ మాదిగ అన్నారు. పేద మహిళల మీద జ రుగుతున్న దారుణాలను పాలకులు పట్టించుకోవడం లేద న్నారు. పురుషునితో పాటు స్త్రీలనూ సమాన భావంతో చూసినప్పుడే దేశం ముందుకు వెళుతుందని సూచించా రు. మహిళలపై నిమిషానికి ఓ లైంగికదాడి జరుగుతుం దని తెలిపారు. మహిళలకు రక్షణ ఉన్నప్పుడే దేశం అభి వృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో శ్వేతా, రాధిక, అనూష, యామిని, దీపిక, తదితరులు పాల్గొన్నారు.