Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ మండలం చిన్న నందిగామ గ్రామపం చా యతీలో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు కావడంతో సర్పంచ్ సావిత్రమ్మ, బీఆర్ఎస్ నాయకులు సాయిలు, వినోద్, మ ల్లేష్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లాప్పలతో కలిసి సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సీసీరోడ్లు నిర్మించడంతో అంత ర్గత రహదారులు బాగుపడుతున్నాయని అన్నారు. ఒక ప్పుడు గ్రామాల్లో వర్షం పడితే రోడ్డు బురదగా మారి నడ వడానికి ప్రజలు ఇబ్బందులు పడే వారన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ఏటా ఉపాధి హామీ, గ్రామపంచాయతీ నిధులతో సీసీరోడ్లు నిర్మించడంతో ప్రజల ఇబ్బందులు తొలగిపో తు న్నాయని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.