Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సౌమ్య వెంకటరా మిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం సర్పంచ్ సౌ మ్య వెంకట్రామిరెడ్డి అంగన్వాడీ టీచర్లను మహిళా ఉద్యో గులను, ఆశావర్కర్లను సన్మానించారు. పలువురు మాట్లా డుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రతి ఒ క్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామపంచా యతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు మైపాల్ ముదిరాజ్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సంగ్య శ్రీనివాస్, వార్డు సభ్యులు కాటన్పల్లి మహిపాల్, గుడాల యాదయ్య, మోత్కూరు వెంకటేష్, సునీత, సర స్వతి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.