Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో సర్పంచ్ సయ్యద్ అంజాద్ ఉపాధి హామీ పనులను పరిశీ లించారు. చెరువు కట్టపై ఉన్న ముళ్లపోదలు దారికి అడ్డం రావడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ప డుతుండడంతో ముళ్ళ పొదలను తొలగించి, చెరువు కట్టకు ఇరువైపులా మట్టి వేయించడంతో రైతులు పొలాలకు వెళ్ల డానికి అనువుగా మారిందని సర్పంచ్ సయ్యద్ అంజాద్ తెలిపారు. ఉపాధి హామీ కూలీలు 100 రోజుల పనిదినా న్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఎంపీటీసీ గొల్లగోవిందమ్మ, బుగ్గప్ప, ఉపసర్పంచ్ మొగులయ్య, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం తదిత రులు పాల్గొన్నారు.