Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
ఎస్టీయూ టీఎస్ బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బి. భుజంగరావును గెలిపించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దారూరు మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి ఓటును వేయటానికి ప్రచారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా డబ్బులు ఆశ చూయించి ఓట్లు వేయించుకోవడం అప్రజాస్వామికమన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యా యులను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. కేజీబీవీ మాడల్ పాఠశాలల్లో బదిలీలు, పదోన్నతులను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.