Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-చౌడాపూర్
కార్యకర్తలు, నిరుపేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు.చౌడాపూర్ మండలం చాకల్పల్లి గ్రామంలోని చిన్న మేగ్యానాయక్ తండా వాసులు మాణిక్యం మృతి చెందాడు. మరో వ్యక్తి అనారోగ్యంతో రెండు కాళ్ళను కోల్పోయి ట్రై సైకిల్ కోసం ఇబ్బంది పడుతున్న జంగయ్యను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎలాంటి పరిస్థితి వచ్చినా తాను అండగా ఉంటానని వారికి భరోసాకల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, వెంకటయ్య, శేఖరయ్య, పెద్దబాబు, కృష్ణయ్య, వెంకట్ రాములు, రాములు, నర్సింహులు, బాలరాజు, వెంకటయ్య పాల్గొన్నారు.