Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు
నవతెలంగాణ-షాద్నగర్
ఈ నెల 16 న కేకేఆర్ కన్వెన్షన్లో నిర్వహించే భారత రాజ్యాంగం, మనుస్మతి అనే అంశాలపై జిల్లా స్థాయి సెమినార్ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కోరారు. గురువారం షాద్ నగర్లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని మనువాదులు, ఆర్ఎస్ఎస్ నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల ప్రజలపై దాడులు, దౌర్జ న్యాలు అధికమయ్యాయని ఆదోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు.ఈ సెమినార్కు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం హాజరవుతున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. శ్రీను, బుద్దుల జంగయ్య, ఎం గోవింద్ నాయక్ పాల్గొన్నారు.