Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలని శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిలు ఉపాధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని కార్యదర్శులను ఆదేశించారు. మండలం లోని అన్ని గ్రామాల్లో మొక్కలకు ట్యాంకుల ద్వారా నీరందించి, వాటిని సంరక్షించాలని కోరారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త వేర్వేరు చేసి, సేకరించే ట్రాక్టర్లోనే వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిం చాలని సూచించారు. ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించాలని ఆదేశించారు. ఎండ మొదలైందనీ, గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకోవలని తెలిపారు. అంతేకాకుండా అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కార్య దర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీత, పంచాయత్ రాజ్ ఏఈ యుగంధర్ రాజు, ఏపీవో నాగభూషణం తదితరులు ఉన్నారు.