Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రఘుపాల్
నవతెలంగాణ-కొత్తూరు
శాసనమండలి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను పెద్దల సభకు పంపించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రఘుపాల్ పిలుపునిచ్చారు. ఈనెల 13న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పెద్దల సభలకు పంపించాలన్నారు. గురువారం యూటీఎఫ్ నాయకులు కొత్తూరు, నందిగామ మండలాల్లో జడ్పీ హెచ్ఎస్ కొత్తూరు, పెంజర్ల, సిద్దాపూర్, కేజీబీవీ, జడ్.పి. హెచ్.ఎస్ నందిగామ, మేకగూడా, మామిడిపల్లి, నర్సప్ప గూడ, ఫాతిమాపూర్ తదితర పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల పోరాట యోధుడు ఉపాధ్యాయుల పక్షపాతి పాపన్నగారి మాణిక్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉపాధ్యాయులందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రంగరెడ్డి జిల్లాఅధ్యక్షులు గోపాల్‌నాయక్, జిల్లా కార్యదర్శి గణేష్, యూటీఎఫ్్ నాయకులు వెంకటేష్, బాలకృష్ణ, రాజేశ్వరి, సత్యనారాయణ, మద్దిలేటి, రెడ్డ్యా నాయక్, మునీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.