Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
- రూ.2.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో పలు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన నిఖల్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షలు ఎల్ఓసీ చెక్కును లబ్దిదారునికి అందజేశారు. అదేవిధంగా మంగళపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి లింగారెడ్డి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.20 వేల చెక్కును ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డికి అందజేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రతి ఒక్కరూ సీఎం సహాయ నిధిని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, శెట్టిపల్లి సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం, సంజీవ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.