Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్
- కల్వకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా వైద్యశిబిరాలు
నవతెలంగాణ-ఆమనగల్
ప్రజాసేవే లక్ష్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ అన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో గత వారం రోజులుగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం భైరాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ట్రస్ట్ చైర్మెన్ జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ మంజుల దంపతులు తలకొండపల్లి ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలంగౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎప్రిల్ 7వ తేదీ వరకూ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉప్పల అఖిల్ ఆధ్వర్యంలో కామినేని ఆస్పత్రి వైద్య బృందం వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న 155 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలకు చెందిన 46 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మెన్ చిత్తరంజన్ దాస్, నాయకులు రమేష్, జగదీష్, అరవింద్, యాదమ్మ, సత్తయ్య, ప్రధానోపాధ్యాయులు రవి, శ్రీకాంత్, మహేష్, శేఖర్, విజేష్ నాయక్, శంకర్ నాయక్, తావుర్యా నాయక్, ఆంజనేయులు, ఉప్పల వెంకటేష్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.