Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుం టామని జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెం దిన సిరిగిరి జంగమ్మ బుధవారం గుండెపోటుతో మృతి చెందింది. ఆమె భర్త అంజయ్య కూడా ఐదేండ్ల క్రితం మృతి చెందాడు. దీంతో వారి ముగ్గురు పిల్లలు ప్రశాంత్, శివ, లక్ష్మీలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి గురువారం ఆ ముగ్గురు పిల్లలను షాబాద్‌లో పరామర్శించి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నట్టు గ్రామస్తులు జడ్పీటీసీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి తక్షణ ఆర్థిక సహా యంగా రూ.10 వేలు అందజేశారు. త్వరలో మరో రూ. 2 లక్షలు ముంగ్గురు పిల్లల పేర్లపై బ్యాంకులో డిపాజిట్ చేస్తామని హామీనిచ్చారు. దీంతో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, నాయకులు సురేందర్‌రెడ్డి, పద్మారావు, బాలకృష్ణ, రాందేవ్ తదితరులు ఉన్నారు.