Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్‌రెడ్డి
- 16 నుంచి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీపు జాత
- 21న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ
నవతెలంగాణ-యాచారం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడానికి ఈనెల 16 నుంచి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీపు జాత చేపడుతున్నట్టు తెలిపారు.ఈ జాత యాచారం మండల కేంద్రంలో రైతాంగంతో కలిసి బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉపాధి లేక కర్షకులు, కార్మికులు, రైతు కూలీలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. వారి సమ స్యలను తెలుసుకునేందుకు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐ టీయూ ఆధ్వర్యంలో దాదాపు ఆరు రోజులపాటు ప్రజా సమస్యలపై ఈ జీపు యాత్ర ఆయా గ్రామాల్లో కొన సాగుతుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్పొరేటు శక్తులకు కొమ్ముకాస్తూ పేదల సంక్షే మాన్ని విస్మరించిందని తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చైతన్యం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. అదేవిధంగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలందరిరనీ చైతన్యం చేస్తామని తెలిపారు.ఈ జాత పూర్తైన తర్వాత ఈనెల 28న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.